సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరగటంతో నీటిని పెన్నా నది ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 1.60లక్షల క్యూసెక్కుల నీటిని వదలటంతో పెన్నా నది తీరం సమీపంలోని గ్రామాల్లోకి నీరు చేరుతోంది. ప్రధానంగా సంగం మండలంలోని వీర్ల గుడిపాడు గ్రామం జలమయమైంది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలతో గ్రామస్థులను రాత్రి బోట్ల సహాయంతో బయటకు తరలించారు. వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతసాగరం, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం, మండలాల్లోని 20 వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. సంగం వద్ద ప్రవహిస్తున్న బీరాపేగు వాగులో ధాన్యం లారీ, ట్రాక్టర్ ఇరుక్కుపోయింది. నీటి ప్రవాహానికి లారీని, ట్రాక్టర్ ను వదిలి కూలీలు బయటకు వచ్చారు.
సోమశిలకు వరద ప్రవాహం..నీట మునిగిన పంటలు - సోమశిలకు వరద ప్రవాహం న్యూస్
నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలకు నీరు చేరుకుంటుంది. ఎగువ నుంచి 1.50లక్షల క్యూసెక్కులు నీరు సోమశిల జలాశయంలోకి వస్తోంది.
సోమశిలకు వరద ప్రవాహం..