నెల్లూరు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకుతోడు ఎగువ నుంచి సోమశిల జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి 20 వేల క్యూసెక్కులు వరద ప్రవాహం రావటంతో.. దిగువకు 13 వేల 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 76 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సంగం పెన్నా వారధి వద్ద సోమశిల వరద ప్రవాహం ఎక్కువగా వుండటం.. వారధిపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తుండటంతో గేట్లు మూసివేశారు. చేజర్ల, పొదలకూరు మండలాలకు అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
సోమశిలకు భారీగా వరద ప్రవాహం.. దిగువకు నీటి విడుదల
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పలు మండలాల్లోని గ్రామాలకు అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
సోమశిలకు భారీగా వరద ప్రవాహం
TAGGED:
సోమశిల జలాశయం తాజా వార్తలు