కరోనా నివారణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవన్నారు.. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం.. పార్టీ శ్రేణులకు కరోనా నివారణ చర్యలపై దిశానిర్దేశం చేశారన్నారు. ప్రజలకు ఈ దిశగా సహకరించాలని సూచించారని తెలిపారు. సీఎం జగన్ కు ఆ స్థాయిలో అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని డిమాండ్ చేశారు.
'కరోనా నియంత్రణ పై ప్రభుత్వం చొరవ చూపడం లేదు'
కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో ప్రతి పక్ష నేత చంద్రబాబుకు ఉన్న చొరవ ప్రభుత్వానికి లేదని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ కు కూడా భద్రత లేదని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం