ప్రజా సమస్యల పరిష్కారం కోసం గుడ్ మార్నింగ్ నెల్లూరు కార్యక్రమం చేపడుతున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. కార్పొరేషన్ ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నగర పాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి గుడ్ మార్నింగ్ నెల్లూరు కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు డివిజన్లలో తనిఖీలు చేపడతామన్నారు. అనంతరం 7.30 నుంచి 9 గంటల వరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికై 'గుడ్ మార్నింగ్ నెల్లూరు' - గుడ్ మార్నింగ్ నెల్లూరు కార్యక్రమం
డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నగర పాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి గుడ్ మార్నింగ్ నెల్లూరు కార్యక్రమానికి రూపకల్పన చేశామని నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు. కార్పొరేషన్ ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికై 'గుడ్ మార్నింగ్ నెల్లూరు' కార్యక్రమం