ఉదయగిరిలో ఉచిత మెగా వైద్య శిబిరం
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
నెల్లూరులో ఉచిత వైద్యం
ఈ మెడ్ ఈవెంట్స్ కార్పొరేషన్ అమెరికా ఆధ్వర్యంలో ఉదయగిరిసామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో మానసిక వ్యాధి, షుగర్, దంత, కంటి, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేశారు. అపోలో క్యాన్సర్ వైద్యశాల, రెయిన్బో, నారాయణ వైద్యశాల, చెన్నై గ్లోబల్ వైద్యశాల నుంచి ప్రత్యేక డాక్టర్లు హాజరై రోగులకు వైద్యం చేశారు. నిర్వాహకురాలు ప్రియా కొర్రపాటి... శిబిరాన్ని పర్యవేక్షించారు.