నెల్లూరు జిల్లాలో రైతు సమస్యలు తీర్చేందుకు టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శాఖ సంయుక్త సంచాలకులు శివ నారాయణ మాట్లాడుతూ...ఇప్పటివరకు జిల్లా నుంచి 307 సమస్యలు వచ్చాయని అందులో 30% పూర్తి చేశామని తెలియజేశారు. ప్రధానంగా ప్రధానమంత్రి పసల్ బీమా యోజన, రుణమాఫీ, రుణాలకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని, ఆ సమస్యలను సంబంధిత శాఖలకు ఫోన్ చేసి పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు టోల్ ఫ్రీ నెంబర్(1800-425-3363)కి ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం ఉపయోగించుకోవాలని కోరారు.
టోల్ ఫ్రీ నంబరుతో రైతన్న సమస్యలకు పరిష్కారం
ప్రభుత్వం రైతు సమస్యలు తీర్చేందుకు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది.
టోల్ ఫ్రీ నంబరుతో రైతన్న సమస్య పరిష్కారం