ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై భారీగా వరద నీరు.. స్తంభించిన రాకపోకలు - నెల్లూరు వరదలపై తాజా వార్తలు

నెల్లూరు జిల్లా గూడూరు-మనుబోలు మధ్య జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దాదాపు 7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

flood water at gudooru  manaboolu  highway
జాతీయ రహదారిపై భారీగా వరద నీరు

By

Published : Nov 27, 2020, 1:29 PM IST

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. గూడూరు-మనుబోలు మధ్య ఆదిశంకర కాలేజీ వద్దనున్న జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చెన్నై నుంచి నెల్లూరుకు వస్తున్న వాహనాలు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

జాతీయ రహదారిపై భారీగా వరద నీరు

ABOUT THE AUTHOR

...view details