ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద - flood flow continued to Somashila Reservoir latest news update

ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి నీటి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడదల చేస్తున్నారు.

flood flow continued to Somshila Reservoir
సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

By

Published : Sep 28, 2020, 10:47 AM IST

సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి లక్షా ఇరవై వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే పెన్నా, ఉత్తర దక్షిణ కాలువల ద్వారా కిందకి విడుదల చేస్తున్నారు. గడచిన పది రోజుల వ్యవధిలో ఇలా వరద ప్రవాహం కొనసాగడం రెండోసారని, దీంతో పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉండే అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, కలువాయి, సంగం, ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

సోమశిల జలాశయం వరద ప్రవాహానికి పెన్నా పరివాహక ప్రాంతంలో పొర్లు కట్టలు ధ్వంసమవుతున్నాయి. వరదలు లేని సమయంలో మరమ్మతులు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. పొర్లు కట్ట వెంబడి ఉన్న గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉండటం ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సోమశిల జలాశయం దిగువున అఫ్రాన్ వద్ద వరద ప్రవాహం ఎక్కువగా వుంటుంది. ఆ వరద ప్రవాహానికి ఎడమవైపు ఉన్న పొర్లుకట్ట కోతకు గురైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయానికి ఎడమవైపు రెండు గేట్లు మూసివేసి మిగతా 10 గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ఈ రెండు పొర్లు కట్టల వద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details