ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో తారాస్థాయికి అధికార పార్టీ 'ఫ్లెక్సీ' పాలిటిక్స్ ! - నెల్లూరులో ప్లెక్సీల గొడవ

నెల్లూరులో అధికార వైకాపాలో ఫ్లెక్సీల గొడవ చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇటీవల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించటం వివాదాస్పదమైంది. విభేదాల కారణంగానే మాజీ మంత్రి అనిల్‌ అనుచరులు వాటిని తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాణి ఫ్లెక్సీల తొలగింపుతో.. ఈ కలకలం తారస్థాయికి చేరింది.

అధికార పార్టీ 'ఫ్లెక్సీ' పాలిటిక్స్
అధికార పార్టీ 'ఫ్లెక్సీ' పాలిటిక్స్

By

Published : Apr 19, 2022, 10:04 PM IST

నెల్లూరులో తారాస్థాయికి అధికార పార్టీ 'ఫ్లెక్సీ' పాలిటిక్స్ !

అధికార వైకాపాలో నెలకొన్న ఆధిపత్య పోరు, వర్గ విభేదాలతో నెల్లూరులో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా మంత్రి కాకాణి ఫ్లెక్సీలు తొలగించటంపై ఆనం సోదరులు మండిపడ్డారు. నెల్లూరులో అరాచకం రాజ్యమేలుతోందని, మంత్రి స్వాగత ఫ్లెక్సీలను సైతం చించేశారని ఆనం జయకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సోమవారం రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. నగరంలోని ముత్తుకూరు రోడ్డు సర్కిల్​లో ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎంపీ ఫ్లెక్సీలను చించి వేయటంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా.. నెల్లూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సైతం..గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. మాజీమంత్రి అనిల్​తో ఉన్న విభేదాల వల్ల.. ఆయన అనుచరులే తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విమర్శల్ని మంత్రి కాకాణి ఖండించారు. ఫ్లెక్సీల రగడపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఆ చోరీతో నాకెలాంటి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధం: మంత్రి కాకాణి

ABOUT THE AUTHOR

...view details