ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం - ap telugu news

fire accident
అగ్నిప్రమాదం

By

Published : Feb 11, 2023, 12:25 PM IST

Updated : Feb 11, 2023, 1:24 PM IST

12:18 February 11

మంటలాను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

Fire Accident In Nellore collectorate : నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాత ఎన్నికల సామాగ్రి మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రెండు వాహనాల వినియోగించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ రోజు రెండో శనివారం కావటంతో కార్యాలయ సిబ్బంది ఎవరు విధులలో లేరు. ఎవరు లేకపోవటంతో ప్రమాద స్థాయి కొంచెం తీవ్రంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముందుగా గమనించి ఉంటే ప్రమాదం తప్పేదని అంటున్నారు. కలెక్టరేట్‌లోని ఓ గదిలో భద్రపరిచిన పాత ఎన్నికల సామగ్రి, కొన్ని దస్త్రాలు, ఫర్నిచర్​ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధం అయ్యింది.

ప్రమాదంపై స్పందించిన కలెక్టర్​ :ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్​ చక్రధర్‌బాబు స్పందించారు. అగ్ని ప్రమాదం జరిగింది పనికిరాని గోదాములో అని ఆయన స్పష్టం చేశారు. గోదాములో విద్యుత్​ కనెక్షన్​ లేదని.. అందువల్ల షార్ట్‌సర్క్యూట్‌ జరగటానికి అవకాశం లేదని వివరించారు. గోదాము పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెత్త తగలబెట్టినట్లుగా ఉందని అన్నారు. చెత్త తగలబడటం వల్లే మంటలు చేలరేగాయని భావిస్తున్నామని తెలిపారు. కాలిపోయిన వాటిలో విలువైన దస్త్రాలేమి లేవని.. ఖాళీ బ్యాలెట్​ బాక్సులే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పనికిరాని ఫర్నిచర్​ కూడా గోదాములో ఉందన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 11, 2023, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details