రైతులను నిండా ముంచిన నకిలీ విత్తనాలు Farmers are losing due to fake seeds: నెల్లూరు జిల్లాలో విత్తనాల దుకాణాలపై వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపంగా మారింది. నకిలీ విత్తనాల బారిన పడి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, వెంకటాచలం మండలాలలో రైతులు ఈ నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. నెల్లూరు నగరంలోని ఓ దుకాణంలో రైతులు వరి విత్తనాలు కొనుగోలు చేశామని.. తీరా పంట చేతికొచ్చేసరికి ఆ విత్తనాలు తరకలుగా మారడంతో రైతులు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే ఇలా జరిగిందేమిటి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టపోయిన వారంతా కౌలు రైతులే.. ఎకరానికి 40 వేలు పెట్టుబడులు పెట్టామని, తీరా చూస్తే పంట మూడు రకాలుగా పంట వచ్చిందని.. ఒకచోట వెన్నుతీస్తుంటే.. ఒకచోట పంట కోత దశకు వచ్చింది.. ఒకచోట విత్తనాలు పచ్చిగా ఉన్నాయి.. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న జిల్లాలో వ్యవసాయ అధికారులు అసలు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన వ్యాపారి వద్దకు వెళ్లి అడిగితే అసలు సమాధానమే చెప్పకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని రైతులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈ విధంగా రైతులకు అన్యాయం జరిగితే.. ఇంతవరకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, వ్యవసాయ అధికారులు కూడా పట్టించుకోవడంలేదని రైతు నాయకులు మండిపడుతున్నారు. అధికారులు పర్యవేక్షణ కొరవడంతోనే ఈ దారుణానికి వ్యాపారులు ఈ దారుణానికి వడగట్టారని రైతు నాయకులు అంటున్నారు. వెంకటాచలం, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు మండలాలలో నకిలీ విత్తనాలు వేసి నష్టం జరిగిన విషయం విషయం మా దృష్టికి వచ్చిందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్ రాజు అంటున్నారు. ఈ విషయంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్నారు.
ఇందిరా సీడ్స్‌లో ఐదు బస్తాలు విత్తనాలు తెచ్చి.. ఆరు ఎకరాల పంట వేశాను. అయితే అది కల్తీ విత్తనం వచ్చింది. ఎకరానికి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టను. ఇప్పుడేమో పంట సరిగా పండలేదు.. విత్తనాల గురించి రైతులు వెళ్లి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఆ విత్తనాలను బీపీటీలు అని చెప్పి ఇచ్చారు. కానీ అందులో బీపీటీలు సగం ఇంకోక విత్తనం సగం ఉంది.. పంటేమో ఒక విత్తనం పండుతోంది ఇంకోక విత్తనం అర్రు వస్తోంది. కొంత బిర్రుపాల మీద ఉంది. ఇప్పుడు వీటిని ఏవరు కొంటారు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి.-రమణయ్య, బాధిత రైతు
ఇవీ చదవండి: