పొలానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి గ్రామంలో సంగాని మాల్యాద్రి (45) అనే రైతు మృతిచెందాడు. కాటేపల్లి గ్రామ సమీపంలో రవీంద్ర అనే రైతు అడవి జంతువుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు.
అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు తొలగిద్దామని వెళ్లి... - farmer died with short circuit in katepalli
పొలానికి వెళ్తుండగా అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కాటేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అడవి జంతువుల నుంచి పంట రక్షణ కోసం పక్క పొలంలోని రైతు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు సాటి రైతు ప్రాణాల్ని బలిగొంది.
రాత్రి సమయంలో తీగలను ఏర్పాటు చేసి ఉదయం తొలగించేవాడు. రవీంద్ర సోమవారం తీగలను తొలగించే విషయాన్ని మరిచి పోయాడు. పక్క పొలానికి చెందిన రైతు మాల్యాద్రి.. పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌తో అక్కడికి వెళ్లాడు. పొలంలోకి వెళ్లేందుకు విద్యుత్ తీగలకు అడ్డంగా ఉండడంతో వాటిని తీస్తుండగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై బాజిరెడ్డి సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:బెదిరింపులు తట్టుకోలేక టిట్‌టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య