'బెల్టుషాపులపై అవగాహన సదస్సు'
బట్టపాడులో బెల్ట్‌షాపులపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు
'బెల్టుషాపులపై అవగానహన సదస్సు'
నెల్లూరు జిల్లా బట్టపాడు దళిత కాలనీలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్‌షాపులపై అవగాహన కల్పించారు. ఇకపై బెల్ట్‌షాపులు నిర్వహిస్తే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు నిలిపివేస్తామని హెచ్చరించారు. నిర్వాహకుల మీద కేసులు పెడతామన్నారు. అప్పటికీ మార్పు రాని పక్షంలో వారి మీద కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.