నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కరోనా కట్టడిలో పాలుపంచుకుంటున్న వివిధ శాఖల ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులు సాయం చేస్తున్నారు. జత మాస్కులు, ఒక శానిటైజర్, గ్లౌజ్లతో కూడిన కిట్లను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వారికి అందిస్తున్నారు. వారి సేవలు మరువలేమని ప్రశంసించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని కోరారు.
వెంకటగిరిలో రక్షణ కిట్ల పంపిణీ
కరోనా కట్టడికి కృషి చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు దాతలు సాయం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు.. శానిటైజర్లు, మాస్కులతో కూడిన కిట్లు అందించారు.
వెంకటగిరిలో రక్షణ కిట్ల పంపిణీ