Rape Attempt on Foreign Woman Case: నెల్లూరు జిల్లాలో విదేశీ వనితపై అత్యాచారయత్నం కేసులో ఇద్దరు నిందితులనకు శిక్ష పడింది. నిందితులు.. జీవితకాలంలో సగం శిక్షను అనుభవించేలా.. 8వ అదనపు జిల్లా సెషెన్స్ కోర్టు న్యాయమూర్తి సి. సుమ తీర్పు వెల్లడించారు. జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు విదేశీ వనితపై లైంగికదాడికి ప్రయత్నించారు. ఘటనపై సైదాపురం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దిశా పోలీసులు.. పది రోజుల్లోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనిపై జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి. సుమ విచారణ చేపట్టారు. నేరారోపణ నిర్ధారణ కావడంతో నిందితులు ఇంగిలాల సాయి కుమార్, మహమ్మద్ అబీద్కు అర్ధ జీవిత ఖైదు వేస్తూ తీర్పు వెల్లడించారు. జీవితకాలంలో సగం శిక్షను అనుభవించేలా తీర్పు చెప్పారు. అలాగే ఒక్కొక్కరికి రూ. 15వేల చొప్పున జరిమానా విధించారు. అయితే.. వీసా గడువు ముగియడంతో విదేశీ మహిళ అప్పటికే స్వదేశానికి వెళ్లిపోయారు.
విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసు.. నిందితులకు శిక్ష - Defendants imposed in attempted rape case in nellore
Rape Attempt Case: నెల్లూరు జిల్లాలో రెండు నెలల క్రితం విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో నిందితులకు శిక్ష ఖరారు అయింది. ఇరువురు ముద్దాయిలు జీవితకాలంలో సగం శిక్షను అనుభవించేలా తీర్పు ఇస్తూ 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది.
విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో నిందితులకు శిక్ష