ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో అమానవీయం..కరోనాతో మృతి..జేసీబీతో ఖననం - నెల్లూరులో గుట్టుచప్పుడు కాకుండా కరోనా మృతదేహాల ఖననం

సంస్కారాలు లేకుండానే కరోనా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కరోనాతో మరణించిన ముగ్గురిని అధికారులు అర్థరాత్రి ఖననం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జేసీబీతో పెద్ద గోతులు తీసి, రసాయనాలతో ఖననం చేస్తున్న వీడియో వైరల్​గా మారింది. అయితే 'పెన్నాలో కొవిడ్‌ మృతుల ఖననం' శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన ఈ కథనానికి... జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.

dead bodies are buried unknowningly in nellore
నెల్లూరులో గుట్టుచప్పుడు కాకుండా కరోనా మృతదేహాల ఖననం

By

Published : Jul 10, 2020, 12:40 PM IST

నెల్లూరులో గుట్టుచప్పుడు కాకుండా కరోనా మృతదేహాల ఖననం

నెల్లూరులో కరోనాతో చనిపోయిన ముగ్గురి మృతదేహాలను గ్రామస్తులు అడ్డుకోవడంతోనే పెన్నానది ఒడ్డున అర్ధరాత్రి ఖననం చేసినట్టు అధికారులు వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశామని సమాధానం ఇచ్చారు.

అర్ధరాత్రి పెన్నానది ఒడ్డున గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. కరెంట్‌ ద్వారా దహనం చేసే పరికరానికి అనుమతి కోరినట్లు ఎంఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనాతో చనిపోయిన వారిలో 6 గంటల తర్వాత వారి శరీరంలో వైరస్‌ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడంతో... వారిని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల తీసుకెళ్లినా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లో అధికారులే ఖననం చేస్తున్నారు.

'పెన్నాలో కొవిడ్‌ మృతుల ఖననం' శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన ఈ కథనానికి... జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. కరోనా మృతదేహాల ఖననంపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. విచారణాధికారిగా నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ నియామంచినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details