నెల్లూరు జిల్లా గూడురులో ఒంటినిండా దెబ్బలతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రేమించిన కారణంగా తనపై తల్లిదండ్రులు దాడి చేశారని బాధితురాలు తెలిపింది. ఇంతకుముందు కూడా ఇలాగే దాడి చేస్తే... పోలీసులు సర్దిచెప్పి తనను ఇంటికి పంపిచారని బాధితురాలు చెప్పింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కారణంగా తండ్రి తనను కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈసారి ఇంటికి పంపిస్తే తన చావుకు పోలీసులే కారణం అని రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.
ప్రేమించిందని కూతురుని కొట్టిన తండ్రి - nellore dst latest news of father daughter
వాలంటైన్ప్ డే వచ్చిందని ప్రేమికులంతా షికార్లు చేస్తుంటే.. ఆ అమ్మాయికి మాత్రం ఆ రోజు తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. ప్రేమలో పడిందంటూ... ఓ తండ్రి కూతురు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కన్నబిడ్డ అని చూడకుండా దాడిచేశాడు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన వివరాలివి.
పోలీసులను ఆశ్రయించిన యువతి
Last Updated : Feb 14, 2020, 10:28 PM IST