పసుపు పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించిందని నెల్లూరు మార్క్‌ఫెడ్ మేనేజర్ సుజాత తెలిపారు. ఉదయగిరి సబ్ డివిజన్ పరిధిలో పసుపు సాగు చేసిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారుల నుంచి ఆమె సేకరించారు. ఈ వివరాలను జేసీకి సమర్పించి... అనుమతి వచ్చిన అనంతరం పంట కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. ఈ కర్షక్ ఆధారంగా ఉదయగిరి సబ్‌డివిజన్ పరిధిలో 171 మంది రైతులు పసుపు సాగు చేసినట్లు నమోదైందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 152 మంది రైతుల పేర్లను నమోదు చేశామన్నారు. సోమవారం నుంచి పసుపు కొనుగోళ్లను ప్రారంభిస్తామని ప్రకటించారు.
నెలాఖరు వరకు గడువు పొడిగింపు
నెల్లూరు జిల్లాలో పసుపు పంట కొనుగోలుకు.. ఈ నెల చివరి వరకు గడువు పొడిగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పూర్తి వివరాలను జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ సుజాత తెలిపారు.
నెలాఖరు వరకు గడువు పొడిగింపు