వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నెల్లూరు విద్యుత్ భవన్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలకు ఒకేసారి బిల్లింగ్ చేయటం వల్ల అధిక బిల్లులు వస్తున్నాయని సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జారీ చేసిన బిల్లులను వెంటనే ఉపసంహరించుకోని, రెండు నెలలకు సరాసరి చేసి కొత్తవి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
'కరోనా కాలంలో కరెంటు బిల్లుల భారం తగునా..' - current bill news
వినియోగదారులపై మోపిన విద్యుత్ చార్జీల భారాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నెల్లూరు విద్యుత్ భవన్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
'కరోనా కాలంలో అధిక కరెంటు బిల్లుల భారం తగునా..'
కనీసం మూడు నెలల పాటు సామాన్యుల నుంచి బిల్లుల వసూలు వాయిదా వేయాలన్నారు. నెలకు 75 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులకు బిల్లును రద్దు చేయాలని కోరారు. బిల్లింగ్ లో లోపాలను సవరించాలని కోరుతూ ట్రాన్స్ కో ఎస్ఈకి సీపీఎం నేతలు వినతిపత్రం అందజేశారు.
ఇది చదవండిమైపాడు బాలాజీ కెమికల్స్‌లో అగ్ని ప్రమాదం