ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 3:51 PM IST

ETV Bharat / state

అకాల వర్షం.. పత్తి రైతుకు తీవ్ర నష్టం

అకాల వర్షాలు పత్తి రైతులను నట్టేట ముంచాయి. పంట కోసే సమయానికి వడగళ్ల వాన వల్ల తీవ్రంగా నష్టపోయామని నెల్లూరు రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

అకాల వర్షం.. పత్తి రైతుకు తీవ్ర నష్టం
అకాల వర్షం.. పత్తి రైతుకు తీవ్ర నష్టం

వడగళ్ల వానతో నేలరాలిన పత్తి

నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వింజమూరు, మర్రిపాడు తదితర మండలాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తుంటారు. ఈసారి లాభాలు చూడొచ్చన్న రైతుల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. ఆత్మకూరు మండలం వాశిలి, అప్పారావుపాలెం గ్రామాల్లో వడగళ్ల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వందల ఎకరాల్లో కోత దశకు వచ్చిన పత్తి నేలరాలింది. అలాగే మొక్కదశలో ఉన్న పత్తిచెట్లు నేలకొరిగాయి. పంట కోసే సమయానికి వర్షం పడడం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు అప్పుల పాలయ్యామని వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details