నాయుడుపేటలో పాస్టర్కు కరోనా పాజిటివ్ - nellore district latest news update
నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం ఆర్ముగం నగర్‌కు చెందిన పాస్టర్కు కరోనా పాజిటివ్ రావడం అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పాస్టర్ కొన్ని రోజుల క్రితం జలుబు, జ్వరంతో బాధపడుతూ సింహపురి ఆసుపత్రికి పరీక్షలు నిమిత్తం వెళ్లాడు. పరీక్షల్లో పాజిటివ్ రావడం అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు.
నాయుడుపేటలో పాస్టర్కు కరోనా పాజిటివ్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం ఆర్ముగంనగర్కు చెందిన పాస్టర్కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితుడు ప్రస్తుతం నెల్లూరు సింహపురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల క్రితం జలుబు జ్వరంతో బాధపడుతూ సింహపురి ఆసుపత్రికి పరీక్షలు నిమిత్తం వెళ్లాడు. కరోనా పాజిటివ్ రావడం ఆయన ఎవ్వరితో ప్రత్యేక్ష సంబంధాలు కలిగి ఉన్నారో తెలుసుకొని వారందరిని అధికారులు క్వారంటైన్ తరలిస్తున్నారు.