కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆందోళన చేపట్టింది. నెల్లూరులోని పూలే విగ్రహం నుంచి ప్రదర్శన నిర్వహించి మంత్రి అనిల్ కుమార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
వివిధ పథకాల పేరుతో దారి మళ్లించిన కార్మిక సంక్షేమ నిధిని తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు. నిర్మాణ రంగానికి అవసరమైన స్టీల్, ఇసుక, సిమెంట్, ఇటుక ధరలను నియంత్రించాలని కోరారు.