ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇదేమి 'ఆనం'దం! - కాంగ్రెస్ భరోసాయాత్ర

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రత్యేక హోదా కాంగ్రెస్ భరోసా యాత్రను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా ఇస్తారని పీసీసీ చీఫ్ రఘువీరా స్పష్టం చేశారు.

పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

By

Published : Feb 23, 2019, 6:52 PM IST

ప్రత్యేక హోదా కాంగ్రెస్ భరోసా యాత్రను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రను వైకాపా కార్యకర్తలుఅడ్డుకున్నారు. యాత్రకు ఆటంకం కలిగించిన వ్యక్తులనుపోలీసులు చెదరగొట్టారు. అలజడి రేపిన వైకాపా శ్రేణులపైపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి రెచ్చగొట్టి మరీ యాత్రఅడ్డుకునేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఆనం... ఆ పార్టీ కార్యక్రమాన్నేఅడ్డుకోవడం దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details