నెల్లూరు నగరంలో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చారని మంత్రి బాలినేని అన్నారు. బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని వివరించారు. యువనేతగా ఉన్న తనను జగన్ ప్రోత్సహించి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకమైన బాధ్యతలు అప్పగించారని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు.
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లకు అభినందన సభ - మంత్రి అనిల్ కుమార్ యాదవ్
మంత్రులు బాలినేని, అనిల్ కుమార్ యాదవ్‌లు బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. నెల్లూరు నగరంలో సభ నిర్వహించారు. బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని వివరించారు.
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు