నెల్లూరు జిల్లా వెలుపోడు రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్ శేషగిరిబాబు పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతు భరోసా కేంద్రాల్లోనే అందించే ఏర్పాటు చేయడంతో పాటు.. రైతులకు సూచనలు, సలహాలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు.
'ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉండాలి' - collectore Inspection of irrigation canals news
నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు సాగునీటి కాలువలను, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. ప్రతినిత్యం జలవనరుల శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
collectore-inspection-of-irrigation-canals-at-sri-potti-sriramulu-nellore-district