నెల్లూరు జీజీహెచ్లో సీటీస్కాన్, ఎంఆర్ఐ యంత్రాలను.. సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:న్యాయమూర్తిగా నటించి.. పోలీసులకు చిక్కి..
తాజాగా ఆసుపత్రికి సమకూరిన అత్యాధునిక సీటీస్కాన్, ఎంఆర్ఐ ఖరీదు రూ. 4 కోట్ల 50 లక్షలు. జిల్లాలోని 46 మండలాల ప్రజలకు నెల్లూరు సర్వజన ప్రభుత్వ వైద్యశాల సేవలు అందిస్తోంది. కరోనా సోకిన 950 మందికి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన పరకరాల ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను సీమెన్స్ కంపెనీ వారు ఏడేళ్లు చేపడతారు. ప్రకాశం, కడప జిల్లాల నుంచి సైతం రోగులు ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు.
ఇదీ చదవండి:కలసికట్టుగా కరోనాపై పోరు