నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం రోజునే వర్గాల మధ్య పోరు మొదలైంది. సభ్యులతో జాయింట్ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయిస్తుండగా వైకాపాకు చెందిన ఓ వర్గం వారు ప్లెక్సీలో తమ ఫోటోలను కింద వేశారని వాగ్వాదానికి దిగారు. గొడవకు దిగి చివరకు ప్లెక్సీని చింపేయటం వరకు వచ్చింది. ప్లెక్సీని చింపేయటం మంచి పద్ధతి కాదని మరో వర్గం నాయకులు వాదనకు దిగారు. తర్వాత జరిగిన అభినందన సభలో కొందరు నాయకులు పాల్గొనలేదు.
ఫ్లెక్సీ వివాదం: ప్రమాణ స్వీకారం రోజే వర్గ పోరు - ycp godava news
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైకాపా వర్గాల మధ్య పోరు మొదలైంది. ప్రమాణ స్వీకారం రోజునే ఓ వర్గం వారు మరొక వర్గంతో వాదనకు దిగారు.
ప్రమాణ స్వీకారం రోజే వర్గ పోరు