CHANDRABABU ON DAGADARTI : నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయ భూములను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులతో బాబు మాట్లాడారు. కృష్ణపట్నం పెద్ద పారిశ్రామిక హబ్‌గా మారాలని కోరారు. రామాయపట్నం పోర్టును ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక హబ్‌గా మారాల్సిన ప్రాంతాన్ని జగన్ అడ్డుకున్నారని.. భావనపాడు పోర్టును వేరే వారికి ఎందుకు అప్పగించారని నిలదీశారు. పోర్టులను ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలన్నారు. గతంలో అందరినీ ఒప్పించి దగదర్తి విమానాశ్రయాన్ని తీసుకువచ్చామని.. జగన్ చేసిన దగాలో ఒక భాగం.. దగదర్తి విమానాశ్రయం అని చంద్రబాబు విమర్శించారు. పోర్టులను ఎందుకు మార్చారో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. కృష్ణపట్నం పోర్టు విషయంలో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఏషియన్ పల్ప్ పరిశ్రమ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని.. కానీ ఆ సంస్థను తరిమేసి ఉపాధి పోగొట్టారని విమర్శించారు.
జగన్ చేసిన దగాలో.. దగదర్తి విమానాశ్రయం ఒకటి: చంద్రబాబు - రామాయపట్నం పోర్టు
DAGADARTI AIRPORT LANDS : రామాయపట్నం పోర్టును ఎందుకు రద్దు చేశారో జగన్ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పారిశ్రామిక హబ్‌గా మారాల్సిన ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయ భూములను ఆయన పరిశీలించారు.
CHANDRABABU
రామాయపట్నం పోర్టు ఎందుకు రద్దు చేశారో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. పారిశ్రామిక హబ్‌గా తయారయ్యే ప్రాంతాన్ని నాశనం చేశారు . పోర్టులు ఎందుకు మార్చారో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. కృష్ణపట్నం పోర్టులో అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారు . రామాయపట్నంలో ఏర్పాటు చేసే పల్ప్ ఇండస్ట్రీని జగన్ తరిమేశాడు. -చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి:
Last Updated : Dec 30, 2022, 10:21 PM IST