ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడూరులో నీళ్ల కష్టాలకు చెల్లుచీటి - etv bharat telugu updates

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం, డక్కిలిలో బిందె నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఇక రాబోయే రోజుల్లో ఉండదు. వీధి కొళాయిలపై ఆధారపడి మహిళలు బారులు కట్టే పనిలేదు.. ఎప్పుడు నీళ్లోస్తాయా అంటూ ఎదురు చూసే దుస్థితి ఇక మీదట ఉండదు. కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కొళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

water problems at nellore district
గూడూరులో నీళ్ల కష్టాలకు చెల్లుచీటి

By

Published : Jun 15, 2020, 10:25 AM IST

ఈ కష్టాలు ఇక సమాప్తం

నెల్లూరు జిల్లా, గూడూరు పట్టణం, డక్కిలి బిందె నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఇక రాబోయే రోజుల్లో ఉండదు. వీధి కొళాయిలపై ఆధారపడి మహిళలు బారులు కట్టే పనిలేదు.. ఎప్పుడు నీళ్లోస్తాయా అంటూ ఎదురు చూసే దుస్థితికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే. ఇందుకు కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కొళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ జాబితాలో మన జిల్లా కూడా ఉండడం విశేషం. ఇందుకు సంబంధించి ఆదేశాలు జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖకు అందాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ జలజీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. కొళాయి కనెక్షన్‌కు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 45 శాతం, కేంద్ర ప్రభుత్వం 45 శాతం వాటాలు చెల్లిస్తాయి. మిగతా పది శాతం ఇతర ప్రయివేటు సంస్థలు, సేవా సంస్థలు లేదా స్థానిక గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు అన్ని గ్రామాల్లో సర్వే చేసి నివేదికను కేంద్రానికి పంపారు. జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పటికే 15 నుంచి 20శాతం వరకు ఇంటింటికి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. నూతన పథకం ద్వారా ఇప్పుడు జిల్లాలోని ఎన్ని ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఉన్నాయో గుర్తించేందుకు ఇంటింటి సర్వే దాదాపుగా పూర్తి కావొచ్చింది. 2024నాటికి జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించాలని ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తలసరి ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్ల రక్షిత మంచినీటిని అందించేందుకు అధికారులు నిర్ణయించారు.

గ్రామసభల్లో కొళాయిల కేటాయింపు

ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌ కోసం ఏర్పాటు చేయడానికి క్షేత్రస్థాయిలో సర్వే జరిగింది. సర్వేను పూర్తి చేసి గ్రామసభల ద్వారా ఇంకా అవసరమైనవారిని గుర్తిస్తాం. వీటి ఆధారంగా ఎన్ని ఇళ్లకు కొళాయి కనెక్షన్‌ కావాలన్నది తెలుసుకుంటాం.

ఇదీ చదవండి:కేటాయింపు రూ.293 కోట్లు.. కొనుగోళ్లు రూ.698.36 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details