నెల్లూరు రాజాగారివీధిలో నివాసం ఉంటున్న దంపతులు... తమ 13 ఏళ్ల కుమార్తెను ఇంట్లో ఉంచి, బయటకు వెళ్లారు. గమనించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న బాలికను కత్తితో బెదిరించి... 68 గ్రాముల బంగారం, రెండు లక్షల నగదు దొంగిలించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులో చోరీ... బాలికను బెదిరించి నగదు, బంగారం తస్కరణ - news updates in nellore
ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి బంగారం, నగదు అపహరించారు. ఈ ఘటన నెల్లూరులోని రాజుగారివీధిలో జరిగింది.
నెల్లూరులో చోరీ