ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2023, 8:26 PM IST

ETV Bharat / state

4నెలల క్రితం నమోదైన దాడి ఘటనలో కోటంరెడ్డి సహా 11 మందిపై కేసు నమోదు.. ముగ్గురు అరెస్టు

నాలుగు నెలల క్రితం తనపై దాడి చేశారని..తెదేపాకు చెందిన ఓ కార్యకర్త ఫిర్యాదు మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సహ ఇతరులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. తన అనుచరులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kotamreddy Sridhar Reddy
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

వైసీపీ అధినాయకత్వంతో విభేదించిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పోలీసుల కేసుల వేధింపులపర్వం కొనసాగుతోంది. 4 నెలల క్రితం తెదేపాకు చెందిన వెంకటకృష్ణ అనే దళిత వ్యక్తిపై దాడి కేసులో తాజాగా కోటంరెడ్డి అనుచరులు ముగ్గురని, పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి సహా 11మంది ఉన్నారని...త్వరలో మరికొందర్ని అరెస్ట్‌ చేస్తామని నెల్లూరు డీఎస్పీ తెలిపారు.

స్పందించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి: నాలుగు నెలల క్రితం జరిగిన ఘటనలో అప్పుడు కేసు కానిది, అధికార పార్టీతో విభేదించిన తర్వాత కేసు అవ్వడం ఆశ్చర్యంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ముఖ్య అనుచరుడు తాటి వేఎంకటేశ్వర్లు అరెస్టును నిరసిస్తూ వేదాయపాలెం స్టేషన్ ఎదుట ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ నాయకుడిని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులను ఆయన ప్రశ్నించారు.

అధికార పార్టీతో విభేదించిన తర్వాత కేసులు పెట్టడం సహజమేనని భావించిన, తన ముఖ్య అనుచరుడి పైనే కేసు పెట్టడమంటే తనపై కేసు పెట్టడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉదయం తమ కార్యాలయంలో ముస్లిం సమస్యలపై నిరసన కార్యక్రమం చేపడితే సాయంత్రానికి అరెస్టు చేశారని చెప్పారు. అరెస్ట్ అయిన వెంకటేశ్వర్లుఏ స్టేషన్లో పెట్టరా కూడా చెప్పలేదని ఎస్పీకి ఫోన్ చేసినా తీయలేదని తెలిపారు. చివరకు నగర డీఎస్పీ ఫోన్ ఎత్తి అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించినట్లు చెప్పారు. వెంటనే తాటి వెంకటేశ్వర్లు కోర్టులో ప్రవేశ పెట్టుకుంటే న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.

మాకు మాతంగి వెంకటకృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఆయనను కొందరు వ్యక్తులు కత్తులు పెట్టి బెదిరించి అతన్ని పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. ఇంతవరకు దాడికి సంబందించిన అంశాలపై ఎవ్వరు ముందుకు రాలేదు. అతనిపై దాడికి సంబంధించి సాక్షులు ముందుకు వచ్చారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ముద్దాయిలను అరెస్టు చేశాం. ఇందులో ఎవ్వరి పాత్ర ఉన్నా.. వారిని అరెస్టు చేస్తాం. తాటి వెంకటేశ్వర్లను అరెస్టు చేసిన తరువాత కోర్టు ముందు హాజరు పరిచాం. ఈ కేసులు మెుత్తం 11మందిపై కేసులు పెట్టాం. దర్యాప్తులో మరింతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. శ్రీనివాసుల రెడ్డి డీఎస్పీ

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పోలీసుల కేసుల వేధింపుల పర్వం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details