ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ బిల్లులను తగ్గించాలి: భాజపా - నెల్లూరులో భాజపా నేతల ఆందోళన వార్తలు

కరోనా కంటే కరెంటు బిల్లులతోనే ప్రజలు భయపడుతున్నారని భాజాపా నాయకులు అన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలపై విద్యుత్ భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరులో నిరసన వ్యక్తం చేశారు.

bjp leaders protest at nellore district
విద్యుత్ బిల్లులను తగ్గించాలని నెల్లూరులో భాజపా నేతల నిరసన

By

Published : May 19, 2020, 1:45 PM IST

నెల్లూరు నగరంలోని నవాబుపేట దగ్గర భాజపా నాయకులు ధర్న చేశారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పేదలను అదుకోవాల్సిన సమయంలో భారం వేయడం దారుణమని నాయకులు అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపివేయాలన్నారు.

ఇదీ చూడండి:

విద్యుత్ ఛార్జీల పెంపుపై తెదేపా నేత నిరసన.. అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details