ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆలయ ఆస్తుల విక్రయంపై తితిదే నిర్ణయం మార్చుకోవాలి'

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని.. భాజపా రాష్ట్ర నాయకులు సురేశ్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారి ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నెల్లూరులో ఉపవాస దీక్ష చేపట్టారు.

bjp leaders hunger strike in nellore
నెల్లూరులో భాజపా నేతల దీక్ష

By

Published : May 26, 2020, 2:07 PM IST

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల శ్రీవారి ఆలయ భూముల అమ్మకాలు చేపడితే ఉద్యమిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయానికి వ్యతిరేకంగా నెల్లూరులో భాజపా నేతలు ఉపవాస దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర నాయకులు సురేశ్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని సురేశ్ రెడ్డి ఆరోపించారు.

తిరుమలతోపాటు ఇతర దేవాలయ భూములు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని.. శ్రీశైలంలోనూ భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేవాలయాల పరిరక్షణ కోసమంటూ ప్రత్యేకంగా ఓ జాయింట్ కలెక్టర్​ను నియమించి మరీ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details