స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం బీసీల ఆందోళన - local body elections
నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం నిరసన చేపట్టింది. గతంలో మాదిరిగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
'నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆందోళన'
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటూ... నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టింది. గతంలో మాదిరిగానే బీసీలకు 34శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు తగ్గింపుతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యథావిధిగా కొనసాగించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.