నెల్లూరులో ఆహార నాణ్యతపై మరోసారి కార్పొరేషన్, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని పలు బార్లు, హోటళ్లలో తనిఖీలు చేశారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. రెండు బార్లకు లక్ష రూపాయలు జరిమానా విధించారు. నిర్వాహకులు పద్ధతి మార్చుకోకుంటే హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
హోటళ్లు, బార్లలో బూజుపట్టిన ఆహారం.. అధికారుల ఆగ్రహం
నెల్లూరులోని బార్లు, హోటళ్లపై అధికారులు దాడులు చేశారు. ఫ్రిజ్‌లలో బూజుపట్టిన ఆహారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హోటళ్లు, బార్లపై అధికారుల దాడులు