కామాక్షి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌పై హత్యాయత్నం
ఆర్‌అండ్‌బీ స్థలంలో ఇంటి నిర్మాణంపై వివాదం మరోసారి చెలరేగింది. జొన్నవాడ కామాక్షి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ పుట్టా సుబ్రమణ్యంనాయుడిపై దుండగులు కత్తితో దాడిచేశారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు.
attack-on-temple-ex-chairman
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం విలియన్స్‌పేటలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఆర్‌అండ్‌బీ స్థలంలో ఇంటి నిర్మాణం వివాదంలో.... జొన్నవాడ కామాక్షి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ పుట్టా సుబ్రమణ్యం నాయుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో సుబ్రమణ్యం నాయుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుచ్చిరెడ్డిపాలెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు.