నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు చేయూతనందిస్తున్నారు. పట్టణంలోని సౌత్రాజుపాలెం ఎస్టీ కాలనీలో దాదాపు 300 మంది పేదలకు యువకులు అన్నదానం చేశారు. సర్వేపల్లి సేవాసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. విపత్కర సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలని వారు కోరుతున్నారు.
నెల్లూరులో 300 మంది పేదలకు అన్నదానం - Distributing food to the poor in caroana time
లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు పలు గ్రామాల్లో యువత ముందుకు వస్తున్నారు. నెల్లూరులోని సౌత్ రాజుపాలెం ఎస్టీ కాలనీలో సర్వేపల్లి సేవాసమితి ఆధ్వర్యంలో యువకులు అన్నదానం చేశారు.
సర్వేపల్లి సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం