నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో... సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు. హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ మాట్లాడారు. ప్రమాణాల ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన కార్యకర్తకు రూ.2 లక్షలు, ఆయాకు రూ.లక్ష ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడి... పని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
అంగన్వాడీలందరూ ఐక్యంగా ఉండి... సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని సీఐటీయూ నెల్లూరు జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోగలుగుతామన్నారు.
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి