ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 3, 2021, 7:01 PM IST

ETV Bharat / state

'వాళ్లు నన్ను ఇబ్బందులకు గురి చేశారు'

నెల్లూరు జేసీ ప్రభాకర్ రెడ్డి సీసీ, డ్రైవర్ తనను ఇబ్బందులకు గురి చేశారని ఓ అంగన్​వాడీ టీచర్ ఆరోపించింది. తన వద్ద నుంచి బలవంతంగా రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని వాపోయింది.

vedayapalem
'జేసీ ప్రభాకర్ రెడ్డి సీసీ, డ్రైవర్ ఇబ్బందులకు గురి చేశారు'

నెల్లూరు జిల్లా అదనపు కలెక్టర్ సీసీ, డ్రైవర్.. మరికొంత మంది వ్యక్తులు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అంగన్​వాడీ టీచర్​గా పని చేస్తోన్న ఓ మహిళ ఆరోపించింది. ఈ విషయంపై ఐదో టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

'కాళ్లు పట్టించుకున్నారు'

నగరంలోని పొదలకూరు రోడ్డు సర్కిల్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ నవంబర్ 9న అంగన్​వాడీ టీచర్​గా అంబేద్కర్ నగర్​లో ఉద్యోగంలో చేరింది. జనవరి 29వ తేదీన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో ఉండాలంటూ సూపర్​వైజర్ చెప్పటంతో జనవరి 9 నుంచి అక్కడికి వెళ్ళింది. జేసీ ప్రభాకర్ రెడ్డి సీసీ, డ్రైవర్ మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆమె వాపోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య కాళ్లు పట్టించుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. విధులకు హాజరుకావడం లేదంటూ ఇబ్బంది పెట్టేవారని.. చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది.

ఇదీ చదవండి:నెల్లూరు బాలిక అత్యాచార ఘటనలో వెలుగులోకి నిజాలు

ABOUT THE AUTHOR

...view details