ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగరపాలకసంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. నవంబర్ 15 న ఎన్నికలు జరగనుండగా.. 17న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు.

all set for nellore municipal elections says district collector chakradharbabu
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ చక్రధర్ బాబు

By

Published : Nov 1, 2021, 7:53 PM IST

నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు (nellore municipal elections)కు సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు(nellore collector chakradharbabu) తెలిపారు. జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం నగరపంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని తెలిపారు. నవంబర్ 15 న ఎన్నికలు 17న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుందన్నారు. నామినేషన్ల స్వీకరణ నవంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతుందన్నారు. 6వ తేదీ నామినేషన్లు పరిశీలన చేయనుండగా.. 8న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ అని ఆయన తెలిపారు. ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహిస్తామని.. ప్రతి ఎన్నికల బూత్​లో 1200 మంది ఓటర్లు మించకుండ ఏర్పాట్లు చేశామన్నారు. 'నౌ యూవర్ యాప్' ద్వారా ఎక్కడ తమ ఓటు వినియోగించుకోవచ్చో తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details