ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంచి విత్తనాలతో పంటల సాగు చేయాలి' - నెల్లూరులో రైతు భరోసా కేంద్రం

మేలు రకాలైన విత్తనాలతో రైతులు వ్యవసాయం చేయాలని నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు కోరారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

agriculture research center scientists conference on nellore
వ్యవసాయం పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు

By

Published : Oct 13, 2020, 6:48 PM IST


ఈ రబీ సీజన్లో వరి పండించే రైతులు వ్యవసాయ అధికారుల, శాస్త్రవేత్తల సూచనలతో మేలు రకాలైన విత్తనాలతో పంటల సాగు చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆనందకుమారి తెలిపారు. ఈ సీజన్లో ప్రధానంగా రైతులు ఎన్ఎల్ఆర్ 34449, బీపీటీ 5204, ఆర్​ఎన్ఆర్ 15 048, ఏడీటీ 37939 రకాలను సాగు చేయాలని ఆమె సూచించారు. రైతులకు విత్తనాలు కావాలంటే రైతు భరోసా కేంద్రాల్లో తప్పనిసరిగా రైతు పేరు నమోదు చేయించుకోవాలన్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా విత్తనాలు రైతులకు అందించేందుకు 21,000 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులకు నాణ్యమైన మంచి రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ,విత్తనాలు కావలసిన రైతులు నెల్లూరు నగరంలోని వ్యవసాయ కేంద్రంలో సంప్రదించాలని సీనియర్ శాస్త్రవేత్త వినీత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details