ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్​లైన్​లో వైద్యుల సూచనలు.. పురుడు పోసిన 108 సిబ్బంది

పురిటి నొప్పులు రావడంతో ఓ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె అంబులెన్స్​లో ప్రసవించింది. 45 ఏళ్ల వయసున్న ఆ గర్భిణికి.. ఇది ఎనిమిదవ సంతానం కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లలందర్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూలీ పని చేస్తూ పోషించుకుంటున్నారు.

అంబులెన్స్​లో బిడ్డకు ప్రసవం
అంబులెన్స్​లో బిడ్డకు ప్రసవం

By

Published : Jul 31, 2021, 9:20 AM IST

108 వాహనంలో ఓ గర్భవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన మస్తానమ్మ అనే గర్భిణికి వయస్సు 45 ఏళ్లు. గురువారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. నాయుడుపేటకు చెందిన అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ అయ్యాయి.

దీంతో... ఆన్​లైన్​లో వైద్యుల సూచన మేరకు అంబులెన్స్ సిబ్బంది పురుడు పోశారు. శిశువు మెడకు తగులుకుని ఉన్న జఠాయువును వారు తప్పించారు. మస్తానమ్మకు ఇది ఎనిమిదవ సంతానం కావడం విశేషం. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మస్తానమ్మ దంపతులు.. పిల్లలందర్నీ సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details