నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు లారీ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న రూ.15 లక్షల విలువైన ఎలక్ట్రికల్ గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. నెల్లూరు షోరూమ్ నుంచి కడప షోరూం సామగ్రి తరలిస్తున్న క్రమంలో నెల్లూరు పాలెం సమీపంలోకి చేరుకునేలోగా బ్యాటరీలో మంటలు వచ్చాయి. స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్లు, క్లీనర్ అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసేలోగానే వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి.
గృహోపకరణాలు తరలిస్తున్న లారీ దగ్ధం - latest nellore district news
నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారిపై లారీ దగ్ధం అవ్వడంతో దానిలోని ఎలక్ట్రికల్ గృహోపకరణాలు కాలిపోయాయి.
గృహోపకరణ వస్తువుల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం