కృష్ణాజలాలు పోతిరెడ్డి పాడు హెడ్ రెగులెటర్ నుంచి వస్తున్న వరద,కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలు కలిపి నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి 30 వేల క్యూసెకుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 10టీఎమ్సీల నీరు నిల్వ ఉంది. జలశాయంలో 78టీఎమ్సీల వరకు నీటి నిల్వ చేసుకోవచ్చని అధికారులు చెపుతున్నారు. రోజురోజుకి వరద ప్రవాహం పెరుగడంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు ఆసించినంతమేర లేకపోయిన సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమశిల జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం - నెల్లూరు జిల్లా
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి 30వేల క్యూసెకుల వరద ప్రవాహం చేరింది. దీంతో వర్షాభావ పరిస్థితులు సరిగా లేకపోయినా సాగునీటికి ఇబ్బంది ఉండదని అన్నదాత ఆనందిస్తున్నాడు.
సోమశిల జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం