ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం అభివృద్ధి చర్యలను వేగవంతం చేసింది. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున వెచ్చిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ కింద ఉన్న సొమ్మును ఈ మేరకు వెచ్చిస్తుండటం విశేషం. జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఈ అంశంపై ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఏఏ పనులు చేపట్టాలన్న దానిపై ప్రణాళికలు సేకరిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటివరకు అయిదు నియోజకవర్గాల వివరాలు అధికారులకు అందినట్లు తెలుస్తుండగా.. మిగతా వాటి వివరాలు అందాల్సి ఉంది. అవి రాగానే ఆ పనులను పరిశీలించి ఆమోదముద్ర వేయనున్నారు. సీసీ రోడ్లు, కాలువలు, ఆర్‌బీకేలు, సచివాలయాల భవనాలు.. ఇలా అనేక నిర్మాణాలకు ఈ సొమ్మును వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ రూ.5 కోట్లు..