ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గో బ్యాక్ ఆంధ్రా..! వివాదాస్పద ఏఓబి ప్రాంతం కొఠియాలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Union Minister Dharmendra Pradhan Controversial Comments: ఒడిశా - ఆంధ్రా వివాదాస్పద కొఠియా ప్రాంతంలో పర్యటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గో బ్యాక్ ఆంధ్రా పోలీస్ అంటూ ఆదేశించారు. దీంతో అక్కడే ఉన్న అతని అనుచరులు.. గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు.

Union Minister Dharmendra Pradhan
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

By

Published : Apr 1, 2023, 10:54 PM IST

Updated : Apr 2, 2023, 2:57 PM IST

Union Minister Dharmendra Pradhan Controversial Comments: కేంద్ర ప్రభుత్వం అంటే దేశంలో అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ఒడిశాకి చెందిన ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రప్రదేశ్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒడిశా-ఆంధ్రా వివాదాస్పద కొఠియా పంచాయతీలో పట్టు చేనేరులో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి.. ఆంధ్రప్రదేశ్​కి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఏపీ పోలీసులను గో బ్యాక్ అంటూ ఆదేశించారు.

అసలు ఏం జరిగిందంటే:కొఠియా గ్రూపు గ్రామాల్లో పర్యటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టు చెన్నార్​లో పర్యటన సందర్భంగా అప్పటికే అక్కడ ఉన్న ఏపీకి చెందిన కొఠియా సీఐ రోహిణి పతి తన సిబ్బందితో ఉన్నారు. అతనిని ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అతనిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తాము ఏపీ పోలీసులమని సీఐ రోహిణి పతి చెప్పారు.

ఆంధ్రా పోలీసులకు ఇక్కడేం పని అని ఆయన కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కొఠియా 21 గ్రామాలు ఇరు రాష్ట్రాల పరిధిలో వస్తాయని, వివాదాస్పద గ్రామాలని రోహిణి పతి వివరణ ఇచ్చారు. అందుకు కేంద్ర మంత్రి.. ఆంధ్రప్రదేశ్​కి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొఠియా ఆంధ్రాకి చెందినది కాదు.. కేవలం ఒడిశాకి మాత్రమే అని అన్నారు.

అంతే కాకుండా ఆంధ్రా పోలీస్ గో బ్యాక్ అని ఆదేశించారు. ఆయన ఆంధ్రా గో బ్యాక్ అనడంతో.. అక్కడే ఉన్న అతని అనుచరులు ఆంధ్రా పోలీస్ గో బ్యాక్ అంటూ పెద్దగా అరూస్తూ నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి ఆదేశాలుతో ఏపీ పోలీసులు చేసేది లేక వెనుతిరిగారు. అదే విధంగా కొఠియా పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఒడిశా దినోత్సవం సభలో సైతం ఆయన ఇదే విధంగా వ్యాఖ్యలు చేయడం చేశారు. మాతృభాషలో బోధనకు సవరణ చేస్తాం. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను ప్రాథమిక భాషలో బోధన జరిగేలా సవరణ తెస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

పట్టు చెన్నార్, కొఠియాలోని పాఠశాలలను పరిశీలించిన కేంద్ర మంత్రి.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాల్సిన ఆవశ్యకతను వివరించారు. వివాదాస్పద గ్రామాల్లో.. అంగన్వాడి కేంద్రాలు, స్ట్రాబెర్రీ సాగు తదితర వాటిని పరిశీలించారు. ఉత్కల్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఇది ఇలా ఉండగా కొఠియాలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్కల్ దివాస్​లో పాల్గొనగా.. ఇదే గ్రామానికి కొద్దిపాటి దూరంలో ఉన్న గంజాయి భద్రలో బీజేడీ ఎమ్మెల్యే ప్రీతం పాడి కూడా ఇదే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంజాయి భద్ర ఒడిస్సాదే అని శుక్రవారం వ్యాఖ్యలు చేశారు.

గో బ్యాక్ ఆంధ్రా.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇవీ చదవండి:

Last Updated : Apr 2, 2023, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details