అనారోగ్యంతో చనిపోయిన ఓ యువతి మృతదేహాన్ని ఆటోలో తరలించిన దయనీయ ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కేజీబీవీలో దుక్కెరి దీపిక ఇంటర్ రెండో సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. జబ్బు పడటంతో తండ్రి పోతురాజు ఈనెల 3న కళాశాలకు వెళ్లి దీపికను ఇంటికి తీసుకెళ్లాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ.. ఆరోగ్యం విషమించింది. ఈనెల 14న పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్ అందుబాటులో లేదు. సూపరింటెండెంట్ స్పందించి ప్రైవేట్ ఆటోను సమకూర్చడంతో అందులోనే మృతదేహాన్ని స్వగ్రామం బొయితిలికి తరలించారు. ఎదిగొచ్చిన కుమార్తె చనిపోవడంతో కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి.
అంబులెన్స్ అందుబాటులో లేక ఆటోలో విద్యార్థిని అంతిమ ప్రయాణం - ఆటోలో విద్యార్థిని అంతిమ ప్రయాణం
అనారోగ్యంతో చనిపోయిన ఓ యువతి మృతదేహాన్ని ఆటోలో తరలించిన దయనీయ ఘటన పాడేరులో చోటుచేసుకుంది. అనారోగ్యంతో పాడేరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన ఇంటర్ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్ అందుబాటులో లేదు. సూపరింటెండెంట్ స్పందించి ప్రైవేట్ ఆటోను సమకూర్చడంతో అందులోనే మృతదేహాన్ని స్వగ్రామం బొయితిలికి తరలించారు.
ఆటోలో విద్యార్థిని అంతిమ ప్రయాణం