Food Poison in Kona Upper Primary School : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు వరుసగా వాంతులు చేసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు ఉపాధ్యాయలు గుర్తించారు. విద్యార్థులను 108 వాహనాల ద్వారా హుటాహుటిన మక్కువ ప్రాథమిక వైద్యాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని పార్వతీపురం, సాలూరు ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కోన పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత - AP Latest News
Parvathipuram Manyam District: కలుషితాహారం తిని.. సుమారు 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు.. వాంతులు చేసుకోవడంతో.. ఉపాధ్యాయులు వారిని ప్రాథమిక వైద్యశాలకు తరలించారు.
Food poisoning at Kona Elementary School
విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఘటనపై ఉపాధ్యాయలతో వాగ్వాదానికి దిగారు. దీంతో పాఠశాల వద్ద కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం వడ్డించిన బిర్యానీ సరిగా ఉడకకపోవడం,.. కుళ్లిన గుడ్లు పెట్టడంతోనే వాంతులు అయినట్లు విద్యార్థులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: