మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య - ap crime news
15:47 February 22
పెళ్లికి హాజరై ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం
MAJOR ROAD ACCIDENT : ఆ ఆటోలో వాళ్లంతా ఓ పెళ్లి వేడుకకు హాజరై ఇంటికి బయలుదేరారు. అప్పటివరకూ ఎంతో సందడిగా గడిపి.. ఆటోలో బయలుదేరిన వారంతా పెళ్లికి సంబంధించిన ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి అలా జరిగింది.. ఇలా జరిగింది అని ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో వారిని మృత్యువు కబళించింది. ఒక్కసారిగా వాళ్లు ప్రయాణిస్తున్న ఆటోను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఐదుగురి ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.
మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువులకు సంబంధించి పెళ్లికి వెళ్లి వస్తుండగా కొమరాడ మండలం చోళపదం వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఊయక లక్ష్మీ, ఊయక నరసమ్మ, మెల్లిక శారదాతో పాటు మరో మహిళ అక్కడిక్కకడే మృతి చెందగా.. మల్లిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 8మంది క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో సహా 13మంది ప్రయాణిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని అంటివలసకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: