ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 28, 2023, 3:25 PM IST

ETV Bharat / state

Jagan Released Amma Odi Funds: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం: సీఎం జగన్

Amma Odi Funds Release: ఈ ఏడాది 'జ‌గ‌న‌న్న అమ్మ ఒడి' నిధులను సీఎం జ‌గ‌న్‌ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో విడుదల చేశారు. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశామని, 1వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని సీఎం పేర్కొన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి
సీఎం జగన్ మోహన్ రెడ్డి

సీఎం జగన్ మోహన్ రెడ్డి

Amma Odi Funds Release: 'విద్యారంగంలో నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం.. చదువులో అంటరానితనాన్ని రూపుమాపగలిగాం.. పెత్తందారులకే అందుబాటులో ఉన్న చదువును పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకురాగలిగాం.. పేద పిల్లల్లో ఏ ఒక్కరూ పేదరికం కారణంగా చదువు ఆగకూడదనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ భావి తరాల భవిష్యత్తు కోసం విద్యపై పెట్టుబడి పెడుతున్నాం' అని సీఎం జగన్ అన్నారు. 'జ‌గ‌న‌న్న అమ్మ ఒడి' నిధులను సీఎం జ‌గ‌న్‌ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..42,61,965 మంది తల్లుల ఖాతాల్లోరూ.6,392.94 కోట్లు జమ చేశామని తెలిపారు. తద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని సీఎం పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మ ఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్లను విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో జ‌మ చేశామని తెలిపారు. ఈ నాలుగేళ్లలో విద్యా రంగంపై మన ప్రభుత్వం రూ.66,722.36 కోట్లను ఖ‌ర్చు చేసిందని చెప్పారు.

ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీపడేలా.. లంచమనే మాట లేకుండా బటన్ నొక్కటమంటే ఇదని సీఎం అన్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించామని, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ చదువులకు దూరం కారాదనే సంకల్పంతో విద్యారంగంపై పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చి ప్రైవేట్‌ స్కూళ్లే విద్యార్థులతో పోటీ పడే పరిస్థితిని కల్పించామని చెప్పారు.

విద్యార్ధులకు అనేక సౌకర్యాలు.. పేద విద్యార్థులను గ్లోబల్‌ స్టూడెంట్లుగా తీర్చిదిద్దుతూ ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ విధానంలో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసిబైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ ఉచితంగా అందిస్తున్నామని, పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చామని అన్నారు. నాడు నేడు తొలిదశ పనులు పూర్తయిన స్కూళ్లలో ఆరు, ఆపై తరగతుల నుంచి డిజిటల్‌ తరగతి గదులను, ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి ప్రపంచంతో పోటీ పడేలా వెన్ను తడుతున్నామని ఉద్ఘాటించారు.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి... మన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉన్నత చదువులు చదివేలా జగనన్న విదేశీ విద్యా దీవెనతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఆదుకుంటున్నామని, స్పోకెన్‌ ఇంగ్లిష్​లో నైపుణ్యాలను సాధించేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్‌’ పరీక్షలకు సన్నద్ధం చేసి సర్టిఫికెట్లు అందించేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈమేరకు అమెరికా సంస్థ ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ జీఈఆర్‌ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాకపోయినా తిరిగి తరగతులకు హాజరైతే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి తల్లులకు సీఎం ఓ విజ్ఞప్తి చేశారు. వారి పిల్లలు చదివే బడుల టాయిలెట్స్, మెయింటెనెన్స్ కోసం రూ.2000 డోనేట్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం జగన్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details